బిఆర్ఎస్ కార్యకర్తల తీరుపై బిఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అసహనం
హైదరాబాద్, అమ్మన్యూస్ ప్రతినిధి :
బీఆర్ఎస్ కార్యకర్తలను బాయిలర్ కోళ్లతో పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పోల్చారు. 10 సంవత్సరాల పాటు కార్యకర్తలను బాయిలర్ కోళ్లలాగ పెంచితే కాంగ్రెస్ కు ఓటు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీ స్కీమ్ లు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాయని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సమీక్షా సమావేశం లో చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు పట్టించుకోలేదని వెల్లడించారు.









