AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం జగన్ ను కలిసిన కేశినేని నాని

ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీకి దూరమైన విజయవాడ ఎంపీ కేశినేని నాని ఇవాళ సీఎం జగన్ ను కలిశారు. కేశినేని నాని, తన కుమార్తె కేశినేని శ్వేతతో కలిసి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వారిరువురు సీఎం జగన్ తో సమావేశమై పలు అంశాలపై చర్చ జరిపారు.

తండ్రి బాటలోనే విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ కేశినేని శ్వేత కూడా టీడీపీకి గుడ్ బై చెప్పడం తెలిసిందే. ఒకవేళ కేశినేని నాని వైసీపీలో చేరితే విజయవాడ రాజకీయాలు అత్యంత ఆసక్తికరంగా మారనున్నాయి.

కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తానని ఇటీవలే ప్రకటించగా… కేశినేని శ్వేత ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. విజయవాడలోని కేశినేని భవన్ వద్ద టీడీపీ జెండాలను, చంద్రబాబు ఫొటోలను వారు కొన్నిరోజుల కిందటే తొలగించారు. ఇక వారు పార్టీకి రాజీనామా చేయడమే మిగిలుంది.

ANN TOP 10