‘సీతారామం’తో తెలుగు తెరపై తళుక్కుమన్నది మరాఠీ ముద్దుగుమ్మ.. మృణాల్ ఠాకూర్! మొదటి సినిమాతోనే.. ఏదో మ్యాజిక్ చేసేసింది. హోమ్లీ లుక్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్నది. దక్షిణాది ఉత్తరాది తేడా లేకుండా.. రెండు ఇండస్ట్రీలలోనూ దుమ్మురేపుతున్నది. ఒక కార్యక్రమంలో మృణాల్ మాట్లాడుతూ చిత్ర పరిశ్రమలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే.. గ్లామర్ మెయింటెయిన్ చేయాల్సిందేనని అన్నారు. ‘అందుకోసం అందరిలాగే నేను కూడా బ్యూటీ టిప్స్ ఫాలో అవుతా.. ముఖానికి పసుపు రాసుకుంటా.. తాజా పండ్లతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటా. ముఖం కాంతిమంతంగా ఉండేందుకు బియ్యం కడిగిన నీళ్లను ముఖంపై స్ప్రే చేసుకుంటానని మృణాల్ తెలిపారు.
