రామంతాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం కన్నతల్లినే చంపేశాడు ఓ కసాయి కొడుకు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు కూడా పూర్తి చేద్దామని చూశాడు. కానీ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
రామంతాపూర్‌లో కొడుకు అనిల్, కోడలు తిరుమలతో సుగుణమ్మ నివసిస్తుంది. సుగుణమ్మ పేరు మీద ఉన్న ఇంటిని కొడుకు కోడలు అమ్మాలని అనుకున్నారు. కానీ సుగుణమ్మ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఎలాగైనా తల్లిని అడ్డు తొలగించుకోవాలని భావించిన అనిల్.. భార్య, స్నేహితుడితో కలిసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత తన తల్లి చనిపోయిందని ఏడుస్తూ డ్రామాలు ఆడాడు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు పూర్తి చేయాలని భావించాడు. కానీ బంధువులకు అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కొడుకు, కోడలు సహా మరో వ్యక్తిని అరెస్టు చేశారు.