భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1 హాలో విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశించింది. చంద్రయాన్-3 తర్వాత మరో మైలురాయిని చేరింది. తొలి ప్రయత్నంలోనే నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగా ప్రపంచవ్యాప్తంగా ఖగోళ శాస్త్రవేత్తలు అభినందిస్తున్నారు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ (NASA) శాస్త్రవేత్త డాక్టర్ అమితాబ్ ఘోష్ సైతం ఇస్రోను ప్రశంసించారు. ప్రయోగాన్ని అద్భుతమైన ప్రయాణంగా పేర్కొన్నారు. శాస్త్రీయంగా ముఖ్యమైందన్నారు. భారత్ ప్రస్తుతం చాలా అంతరిక్ష ప్రయోగాలు చేపడుతోందని.. గగన్‌యాన్ కోసం సన్నాహాలు చేస్తుందన్నారు.
గత ఇస్రోతో సహా అంతరిక్ష ప్రపంచంలో అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. ఆదిత్య ఎల్ విజయం తర్వాత సైన్స్, అంతరిక్ష ప్రపంచంలో భారత్ ఎక్కడ నిలబడిందో చూస్తే.. ఇది చాలా ఉత్తేజకరమైన, అద్భుతమైన ప్రయాణం అన్నారు. ఇదిలా ఉండగా.. భారతదేశ తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్-1ను ఇస్రో శనివారం విజయవంతంగా లాంగ్రాంజ్ పాయింట్-1ని చేరింది. ఇస్రో ఆదిత్య ఎల్-1ని సెప్టెంబర్ 2న ప్రారంభించింది. మిషన్ విజయవంతమైన తర్వత ఇస్రో చీఫ్ సోమనాథ్ మామాట్లాడుతూ.. ప్రస్తుతం ఆదిత్య ఎల్-1 సరైన స్థానంలో ఉందన్నారు. శాస్త్రవేత్తలు కొన్ని గంటల పాటు పరిశీలిస్తారని.. అనుకున్న మార్గం నుంచి కొంచెం తప్పుకుంటే మళ్లీ.. దిద్దుబాటు చేయాల్సి ఉంటుందన్నారు.