తెలంగాణలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ కేసులో నాంప్లలి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఏడుగురు నిందితులకు కోర్టు షాక్ ఇచ్చింది. వారికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కోర్టు విచారణకు హాజరుకాలేదని కోర్టు సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. నిందితుల గైర్హాజరు పిటిషన్ ను నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది. ఆ ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు ఇచ్చింది.
పేపర్ లీకేజీ కేసులో ఎగ్జామినేషన్ కోసం హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు. విచారణకు గైర్హాజరైన నిందితులు.. గైర్హాజరు పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను తోసిపుచ్చిన నాంపల్లి న్యాయస్థానం.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశించింది.
గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ స్కామ్ లో ఇప్పటివరకు 50మందికి పైగా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వీరిలో ఏడుగురు ముద్దాయిలు మాత్రం కోర్టుకు హాజరుకావడం లేదు. గైర్హాజరు అవుతున్నారు. అంతేకాదు గైర్హాజరు పిటిషన్ కూడా వేశారు. దీనిపై కోర్టు సీరియస్ అయ్యింది. ఆ పిటిషన్ ను తోసిపుచ్చిన కోర్టు.. ఏడుగురు ముద్దాయిలు కచ్చితంగా హాజరుకావాల్సిందే అంటూ నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. వారందరిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాల్సిందిగా పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది న్యాయస్థానం.
పేపర్ లీకేజీ కేసులో 50మందికిపైగా అరెస్ట్ అయ్యారు. వీరందరిపై ఇప్పటికే పోలీసులు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అధికారులు కూడా ఛార్జిషీటు దాఖలు చేశారు. ఇందులో కోర్టుకు హాజరుకావాలని కొందరికి నోటీసులు జారీ చేసినా.. కోర్టుకు హాజరుకాకపోవడం, పైగా గైర్హాజరు పిటిషన్ వేయడం.. న్యాయస్థానాన్ని తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. ఈ నేపథ్యంలోనే వారందరికీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. వీరందరిని వెంటనే అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది.