కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు షర్మిల. తన కుమారుడి నిశ్చితార్థం, వివాహ వేడుకకు సీఎం రేవంత్ ను ఆహ్వానించారు షర్మిల. తన కుమారుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరితో వివాహ నిశ్చితార్థంతో పాటు పెళ్లి వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ కు అందజేశారు.
తన కుమారుడు రాజారెడ్డి, అట్లూరి ప్రియకు వివాహం ఫిక్స్ అయిందని, కుటుంబ సమేతంగా హాజరుకావాలని సీఎం రేవంత్ ను వైఎస్ షర్మిల ఆహ్వానించారు. అలాగే ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి సైతం రావాలని షర్మిల కోరారు. కాగా, తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు షర్మిల. ఇక, ఇటీవలే ఆమె కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే.