AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీఎస్‌పీఎస్సీలో తవ్వేకొద్ది వెలుగుచూస్తున్న అక్రమాలు

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల వ్యహారం రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్‌ ప్రశ్నాపత్రం లీక్‌తో మొదలైన ప్రవీణ్‌ బాగోతాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్‌ కేసులో హనీ ట్రాప్‌ వ్యవహరం కూడా బయటపడిరది. ఇదిలా ఉంటే తాజాగా ఈ కేసులో విస్తుపోయే అంశాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్‌ 1 ఎగ్జామ్‌ పేపర్‌ కూడా లీకైనట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతేడాది అక్టోబర్‌ 16న జరిగిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ ప్రశ్నాపత్రాన్ని సైతం ప్రవీణ్‌ లీక్‌ చేశాడాన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జనవరి 13 న ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రశ్నాపత్రాల లీకేజ్‌లో కీలక పాత్రదారుడు ప్రవీణ్‌ కూడా గ్రూప్‌ 1 పరీక్షకు హాజరుకావడం గమనార్హం. పరీక్ష రాసినా కొన్ని కారణాలతో ప్రవీణ్‌ క్వాలిఫై కాలేకపోయాడు. దీంతో ప్రవీణ్‌ రాసిన ప్రిలిమ్స్‌ ఎక్సామ్‌ పేపర్‌ను అధికారులు వెరిఫై చేస్తున్నారు.

ప్రవీణ్‌కు గ్రూప్‌-1లో 103 మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రవీణ్‌ కింగ్‌ పిన్‌గా మారాడు. మహిళలతో వ్యవహారాలు నడుపుతూ అడ్డగోలు దందా చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్‌ ఫోన్‌లో విచ్చలవిడిగా నగ్న చిత్రాలు, అసభ్య చాటింగ్‌లను పోలీసులు గుర్తించారు. ప్రవీణ్‌ ఫోన్‌ను పోలీసులు ఫోరెన్సిక్‌కు పంపించారు. ఈనెల 25 తర్వాత నివేదిక రానుంది.

ANN TOP 10