జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడిన నుపుర్
బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ (Aamir Khan) కూతురు ఐరా ఖాన్ (Ira Khan) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ప్రియుడు, ఫిట్నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరే (Nupur Shikhare)ను ఐరా వివాహం చేసుకున్నారు. బంధువులు, స్నేహితుల సమక్షంలో ఐరా, నుపుర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ముంబైలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. వివాహం అనంతరం అదే హోటల్‌లో రిసెప్షన్ జరిగింది.
అయితే, ఈ వివాహం చాలా బిన్నంగా జరిగింది. సాధారణంగా వరుడు గుర్రం లేదా, కారుపై ఊరేగింపుగా పెళ్లి మండపానికి చేరుకుంటూ ఉంటారు. అయితే నుపుర్ మాత్రం దాదాపు 8 కిలోమీటర్లు జాగింగ్ చేస్తూ వివాహ వేడుక వద్దకు చేరుకున్నాడు. జాగింగ్ దుస్తుల్లోనే ఐరాను మనువాడాడు. ఇక ఈనెల 8వ తేదీన ఈ జంట మరోసారి వివాహ వేడుక జరుపుకోనుంది. ఆ తర్వాత జనవరి 13వ తేదీన ముంబైలో గ్రాండ్‌గా వివాహ విందు ఏర్పాటు చేయనున్నారు.









