AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ మందిరం పేల్చేస్తామంటూ యూపీ సీఎంకు బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (Yogi Adityanath)కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయోధ్యలో నిర్మించిన రామ మందిరం తో సహా సీఎంను పేల్చేస్తామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు వారు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న సమయంలో ఈ బెదిరింపులు రావడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.

ఈ బెదిరింపులతో అప్రమత్తమైన యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్‌ ఆధారంగా నిందితులు ఓం ప్రకాశ్‌, తాహర్‌ సింగ్‌గా గుర్తించారు. ఈ మేరకు ఆ ఇద్దర్నీ అరెస్ట్‌ చేశారు. గోండాకు చెందిన వీరిద్దరూ పారామెడికల్‌ ఇనిస్టిట్యూట్‌లో పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

ANN TOP 10