AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహిళా కమిషన్‌కు బండి సంజయ్ లేఖ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌కు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఈనెల‌ 18న‌ శనివారం కమిషన్ ముందు హాజరవుతున్నట్లు తెలిపారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కమిషన్ ఆదేశించినట్లుగా బుధవారం హాజరుకాలేనని లేఖలో బండి సంజయ్ పేర్కొన్నారు. బాధ్యత కలిగి‌న పార్లమెంట్ సభ్యడిగా బడ్జెట్ సమావేశాలకు హాజరుకావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బండి సంజయ్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.

ANN TOP 10