టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ పేస్‌కు దాసోహమైన సఫారీలు.. 23.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యారు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిషేధం ఎత్తివేశాక ఆ జట్టుకు ఇదే అత్యల్ప స్కోరు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్.. 34.5 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. టీ విరామ సమయానికి 111/4 స్కోరుతో నిలిచిన టీమ్‌ఇండియా అనుహ్యంగా కుప్పకూలింది. భారత్ తన చివరి ఆరు వికెట్లను 11 బంతుల వ్యవధిలో కోల్పోవడం గమనార్హం. లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ఎంగిడి ఒకే ఓవర్లో కేఎల్ రాహుల్ (8), రవీంద్ర జడేజా (0), జస్‌ప్రీత్ బుమ్రా (0)లను పెవిలియన్‌కు పంపాడు. రాహుల్.. వికెట్‌కీపర్ వెరినేకు క్యాచ్ ఇవ్వగా.. జడేజా, బుమ్రా స్లిప్‌లో మార్కో జాన్‌సెన్‌కు చిక్కారు. రబాడ వేసిన తర్వాతి ఓవర్‌లో కోహ్లీ (46; 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) మార్‌క్రమ్‌కు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో సిరాజ్ (0) రనౌట్ కాగా.. ప్రసిద్ధ్ కృష్ణ (0) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు.
కాగా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాను 55 పరుగులకే ఆలౌట్ చేసింది టీమ్ఇండియా. భారత పేసర్ సిరాజ్ ఆరు వికెట్లతో విజృంభించడంతో దక్షిణాఫ్రికా 55 పరుగులకే క్పుకూలింది.
ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 153 పరుగులు ఆలౌట్ అవ్వడంతో దక్షిణాఫ్రికాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ప్రస్తుతం 17/0పరుగులతో ఉంది. క్రీజులో మార్కరామ్ 11, ఎల్గర్ 5 పరుగులతో ఉన్నారు.









