AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మల్లు భట్టి విక్రమార్కను సన్మానించిన ఓయూ విద్యార్థులు

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు సన్మానించారు. భట్టి విక్రమార్కను, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను రాష్ట్ర సచివాలయంలో… టీపీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ చైర్మన్ లోకేశ్ యాదవ్ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ నుంచి బస్సుల్లో బయలుదేరి సచివాలయానికి చేరుకున్నారు. మల్లు భట్టితో విద్యార్థి నాయకులు కేక్ కట్ చేయించి, సన్మానించారు. మల్లు భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు సంబంధించిన ఫోటోలను లోకేశ్ యాదవ్ బహూకరించారు.

ఈ సందర్భంగా లోకేశ్ యాదవ్ మాట్లాడుతూ… కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం అవకాశాలు కల్పిస్తారని ఆకాంక్షించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలన అక్రమాలను, అన్యాయాలను ఎండగడుతూ మల్లు భట్టి విక్రమార్క 1365 కిలో మీటర్ల పాదయాత్ర చేశారని, తద్వారా కాంగ్రెస్ పార్టీకి బలం తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మల్లు భట్టి పాదయాత్ర ఎంతో దోహదపడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ముఖ్యపాత్రను పోషించిన మల్లు భట్టిని తాము సన్మానించామని తెలిపారు.

ANN TOP 10