తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు బిగ్ అలర్ట్. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సమయంలో కీలక మార్పు జరిగిందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పు కేవలం ఒక్క రోజు(మంగళవారం) మాత్రమేనని స్పష్టం చేశారు. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే ట్రైన్ నెంబర్ 20834 ట్రైన్.. ఇవాళ సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బదులుగా సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరుతుందన్నారు. పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం కావడంతో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ ఈ రోజు గంటన్నర ఆలస్యంగా బయలుదేరుతోంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాల్సిందిగా రైల్వే అధికారులు పేర్కొన్నారు.
కాగా, విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలును సంక్రాంతి కానుకగా జనవరి 15న ప్రధాని నరేంద్రమోదీ ప్రారభించిన సంగతి తెలిసిందే. ఈ రైలు ప్రయాణికులకు జనవరి 16 నుంచి అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అలాగే సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.