AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కేబీసీలో రేవంత్ రెడ్డి గురించి ప్రశ్న.. లైఫ్‌ లైన్ తీసుకున్న కంటెస్టెంట్

కౌన్‌ బనేగా కరోడ్‌పతి షోకి ఇండియాలో ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. తొలుత హిందీలో ప్రారంభమైన ఈ షో.. ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి విస్తరించింది. ఇందులో పాల్గొన్న సామాన్యులు కోటీశ్వరులయ్యారు. ఈ షో హిందీలో ప్రారంభమై 24 ఏళ్లు అయినా ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ప్రజెంట్‌ 15వ సీజన్‌ నడుస్తోంది. కాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రశ్నకు సమాధానమివ్వడానికి కౌన్ బనేగా కరోడ్పతి (కెబిసి) కంటెస్టెంట్ ఇటీవల లైఫ్‌లైన్‌ను ఉపయోగించారు. ఈ నెల 15న ప్రసారమైన కేబీసీ ఎపిసోడ్‌లో రూ.40 వేల ప్రశ్నగా రేవంత్‌ రెడ్డి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? అని పార్టిసిపెంట్‌ను హోస్ట్‌ అమితాబ్‌ ప్రశ్నించారు. ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, ఆంధప్రదేశ్‌ అని ఆప్షన్స్ ఇచ్చారు.

అయితే సదరు కంటెస్టెంట్ సమాధానం చెప్పలేక.. కన్‌ఫ్యూజ్ అయ్యింది. దీంతో లైఫ్‌లైన్‌ ఆప్షన్ తీసుకుంది. పోల్ తర్వాత, 80 శాతం మంది ప్రేక్షకులు “తెలంగాణ” అని.. 11 శాతం మంది “ఛత్తీస్‌గఢ్” అని ఎంచుకున్నారు. మిగిలిన వారు C, D ఆప్షన్స్ ఎంచుకున్నారు. తెలంగాణ లాక్ చేసేందుకు ఆమె అంగీకరించారు. అది కరెక్ట్ ఆన్సర్ అవ్వడంతో తదుపరి ప్రశ్నకు అర్హత సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మారిందని.. తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారని ఈ సందర్భంగా అమితాబ్ వ్యాఖ్యానించారు.

ANN TOP 10