AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రామ్ గోపాల్ వర్మపై మహిళా కమిషన్కు బర్రెలక్క ఫిర్యాదు.!

టాలీవుడ్ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై (Ram Gopal Varma) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన బర్రెలక్క (శిరీష) రాష్ట్ర మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. త‌న‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఈ ఫిర్యాదు చేసిన‌ట్లు బర్రెలక్క తెలిపింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. వ‌ర్మ దర్శకత్వంలో వస్తున్న తాజా మూవీ వ్యూహం. ఈ సినిమా డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. సినిమా విడుదలను జనవరి 11వరకు తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇటీవ‌ల జ‌రిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బర్రెలక్క రామ్ గోపాల్ వర్మ ప్ర‌స్తావిస్తూ.. ఊరు పేరు తెలియ‌ని ఒక అమ్మాయి తెలంగాణలో బర్రెలక్కగా ఫేమ‌స్ అయిపోయింది. బర్రెలక్క అంటే బర్రెల‌ను కాస్తాది. అయితే బర్రెల‌ను కాసే ఒక అమ్మాయి పాపుల‌ర్ అయిపోతే ఈయ‌న సూప‌ర్ స్టార్ (పీకే) అయ్యి ఉండి అక్కడ‌ బర్రెల‌క్క అయిపోయాడు. అంటూ తనదైన శైలిలో సెటైరికల్ కామెంట్ చేశారు వర్మ. దీంతో ఈ కామెంట్స్ ను సీరియస్‌గా తీసుకున్న బర్రెలక్క.. ఆమె తరపు న్యాయవాది రాజేశ్ కుమార్ స‌హాయంతో తెలంగాణ మహిళా కమిషన్ కు రామ్ గోపాల్ వర్మపై ఫిర్యాదు చేసింది.

ANN TOP 10