AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

టీచర్‌, విద్యార్థి రొమాన్స్.. కిస్‌లు, హగ్‌లు.. ఫోటోషూట్ వైరల్

ఓ టీచ‌ర్ త‌న స్టూడెంట్‌తో కలిసి చేసిన రొమాంటిక్ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. స్టడీ టూర్‌ కోసం బయటికి వెళ్లిన వాళ్లు.. ఫోటోలకు పోజులు ఇస్తూ ప్రపంచాన్ని మైమరిచిపోయారు. ప్రేమ‌లో మునిగిపోయిన.. ప్రేమికుల మాదిరిగా.. ముద్దులు, హగ్‌లతో రెచ్చిపోయారు. వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతోంది.

అతడో స్కూల్ విద్యార్థి, ఆమె ఆ గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్. అయితే స్కూల్ విద్యార్థులను స్టడీ టూర్‌కు తీసుకువెళ్లిన ఆ ప్రిన్సిపల్.. అందులోని ఓ విద్యార్థితో రొమాన్స్ చేసింది. ముద్దులు, హగ్‌లతో వారిద్దరూ రెచ్చిపోయారు. ఆ రొమాన్స్‌ను ఫోటోషూట్ కూడా చేసుకున్నారు. అయితే ఆ విద్యార్థుల్లో ఒకరు వారి ఫోటోలను తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సంఘటన కర్ణాటకలో జరిగింది.

చిక్కబళ్లాపూర్‌ జిల్లా మురుగుమల్లలోని ఓ గవర్నమెంట్ స్కూల్‌ స్టూడెంట్స్‌, టీచర్లు స్టడీ టూర్‌కు వెళ్లారు. అక్కడ ఓ పదో తరగతి చదువుతున్న విద్యార్థితో ఆ పాఠశాల టీచర్ ఫోటోషూట్ చేసింది. రొమాంటిక్‌ ఫోటోలకు వారు ఇద్దరూ పోజులు ఇచ్చారు. అంతటితో ఆగకుండా ముద్దులు పెట్టుకుంటూ.. కౌగిలించుకుంటూ.. వారు రెచ్చిపోయారు. ఆ విద్యార్థి పసుపు రంగు షేర్వానీ వేసుకోగా.. ఆ టీచ‌ర్ గులాబీ రంగు చీర ధ‌రించి పచ్చటి చెట్ల మధ్య ఫోటోలకు పోజులు ఇచ్చారు.

అయితే ఆ ఫోటోల్లో ఉన్న విద్యార్ధి, టీచర్‌ వివరాలు మాత్రం ఇప్పటి వరకు వెల్లడికాలేదు. ప్రస్తుతానికి ఈ ఫోటోషూట్‌పై నెటిజన్లు భిన్నరీతిలో స్పందిస్తున్నారు. కొందరు ఆ విద్యార్ధి, టీచర్‌ చేసిన పనికి తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి వారు సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ ఫోటోషూట్‌ విషయం తెలుసుకున్న ఆ పదో తరగతి విద్యార్థి తల్లిదండ్రులు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (బీఈవో)కి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని.. ఆ వ్యవహారానికి సంబంధించిన టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆ పాఠశాలకు వెళ్లి టీచర్‌తో గొడవకు దిగారు.

ANN TOP 10