AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముకేశ్ అంబానీ 3 కీలక ప్రకటనలు!

కొత్త ఏడాదిలోకి అడుగు పెడుతున్న తరుణంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ పలు కీలక అంశాలను వెల్లడించారు. ఆయన ఏం చెప్పారో ఆయన మాటాల్లోనే ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటి నుండి మూడు రోజుల్లో మేము 2023కి వీడ్కోలు పలుకుతాము. 2024కి ప్రవేశిస్తాము. రిలయన్స్ ఫ్యామిలీ అధినేతగా, నూతన సంవత్సరానికి సంబంధించి మూడు కీలక సందేశాలను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. వాటిని 3 కేటగిరిలుగా విభజించుకొని, ప్రతి అంశం గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.

మొదటిది: డిజిటల్ ప్లాట్‌ఫామ్స్, డేటా, ఏఐ వినియోగంలో గ్లోబల్ లీడర్‌లలో రిలయన్స్ స్థానాన్ని మరింత బలోపేతం చేద్దాం. రెండోవది: టాలెంట్ ఎన్‌రిచ్‌మెంట్‌లో గ్లోబల్ లీడర్‌లలో రిలయన్స్ స్థానాన్ని పటిష్టం చేద్దాం. మూడోది: సంస్థాగత సంస్కృతిలో గ్లోబల్ లీడర్‌లలో రిలయన్స్ స్థానాన్ని ఏకీకృతం చేద్దాం. ఇప్పుడు మనం ఈ మూడు అంశాల గురించి వివరంగా తెలుసుకుందాం.

ముందుగా ఏఐ వినియోగం అంశానికి వస్తే.. రిలయన్స్ ఒక ప్రత్యేకమైన కొత్త యుగం టెక్నాలజీ కంపెనీగా అవతరించడంతో… నిర్ణయం తీసుకోవడం, వనరుల వినియోగం వంటి అంశాల్లో మరింత మెరుగ్గా మారడానికి డేటా, ఏఐని వినియోగించుకోవాలి. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ కాలంలో టాలెంట్, డబ్బుతో పాటు డేటా కూడా కొత్త ఉత్పత్తి కారకంగా మారింది. డేటా వినియోగంలో ముందు వరుసలో నిలవాలి. ఏఐ వినియోగంతో ఉత్పాదకత, సామర్థ్యంలో భారీ పెరుగుదలను నమోదు చేయాలి. డిజిటల్ సర్వీసెస్, గ్రీన్ అండ్ బయో-ఎనర్జీ, రిటైల్ అండ్ కన్స్యూమర్ బ్రాండ్‌లు, ఓ2సీ అండ్ మెటీరియల్స్ బిజినెస్, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ వంటి రిలయన్స్‌ వృద్ధికి దోహదపడిన అనుబంధ సంస్థలు వచ్చే ఏడాది మళ్లీ కలిసే సమయానికి ఈ పరివర్తనను పూర్తి చేయాలి. ఇంకా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి కల్పన వంటి దేశ ముఖ్యమైన ప్రాధాన్యతలను పరిష్కరించడానికి ఏఐని అభివృద్ధి చేయడంలో అగ్రగామిగా మారడానికి ప్రయత్నాలు వేగవంతం చేయాలి.

ANN TOP 10