టీడీపీ అధినేత చంద్రబాబు గురువారం కుప్పం పర్యటనకు ముందు బెంగళూరు వెళ్లారు. ఈ సందర్భంగా ఆసక్తికర దృశ్యం కనిపించింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో చంద్రబాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పరస్పరం ఎదురయ్యారు.
హైదరాబాద్ నుంచి కుప్పం వెళ్లేందుకు బెంగళూరు వచ్చిన చంద్రబాబు విమానం దిగగా… అదే సమయంలో నాగపూర్ వెళ్లే విమానం ఎక్కేందుకు డీకే శివకుమార్ అక్కడికి వచ్చారు. ఇరువురు ఎదురుపడడంతో మర్యాదపూర్వకంగా పలకరించుకున్నారు.
కరచాలనం అనంతరం చంద్రబాబు, డీకే శివకుమార్ కొద్దిగా పక్కకు వెళ్లి కాసేపు మాట్లాడుకున్నారు. దీనిపై టీడీపీ వర్గాలు స్పందించాయి. ఇందులో రాజకీయ కోణం ఏమీ లేదని, ఇద్దరూ మర్యాదపూర్వకంగా మాట్లాడుకున్నారని స్పష్టం చేశాయి.