AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫీర్జాదిగూడ శ్రీచైతన్య హాస్టల్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ శివారు మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఫీర్జాదిగూడలో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. శ్రీ చైతన్య కాలేజీలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష.. కాలేజీ ఆవరణలోని హాస్టల్‌లో ఉంటోంది. గురువారం మధ్యాహ్నం లంచ్‌ బ్రేక్‌లో తన గదిలోకి వెళ్లిన వర్ష.. చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన ఇతర విద్యార్థినులు.. విషయాన్ని కాలేజీ మేనేజ్‌మెంట్‌కు తెలియజేశారు.

ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు స్వస్థలం నాగర్‌కర్నూలు జిల్లా వీపనగండ్లగా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేకనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించారు.

ANN TOP 10