హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అమిత్ షా (Central minister Amit Shah) నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అమిత్ షాకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల, తరుణ్ చుగ్ పొంగులేటి తదితరులు స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్‌కు కేంద్ర హోంమంత్రి బయలుదేరి వెళ్లారు. నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్య నేతలతో షా సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై రాష్ట్ర నేతలతో అమిత్ షా చర్చించనున్నారు. మధ్యహాన్నం 3:05గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయానికి అమిత్ షా వెళ్లనున్నారు.
అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించనున్నారు. 3:50 గంటలకు కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్‌కు కేంద్రహోంమంత్రి చేరుకుంటారు. గంటన్నర పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్రనేతలకు బీజేపీ అగ్రినేత దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5:40 గంటలకు కొంగరకాలన్ నుంచి శంషాబాద్ నోవాటెల్ హోటల్‌కు షా చేరుకుంటారు. సాయంత్రం నోవాటెల్‌లో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో సమావేశంకానున్నారు. అసెంబ్లీలో బీజేపీ శాసనసభపక్ష నేతను అమిత్ షా ఎంపిక చేయనున్నారు. సాయంత్రం 6:50 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి తిరుగు ప్రయాణంకానున్నారు.