ఆదిలాబాద్ ప్రతినిధిః ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తొలిసారిగా జిల్లాకేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ , శిశు సంక్షేమశాఖ మంత్రివర్యులు (దనసరి అనసూయ) సీతక్కకు కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అపూర్వ స్వాగతం పలికారు. మావల బైపాస్ వద్ద పార్టీ శ్రేణులతో కలిసి ఆమెకు స్వాగతం పలికారు. పూలబోకే అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఆయన నేతృత్వంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పూలబోకేలతో స్వాగతం పలికి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పారు. ఈ కార్యక్రమంలో కంది శ్రీనివాసరెడ్డి వెంట తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్‌రెడ్డి, బోథ్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడే గజేందర్, డీసీసీబీ మాజీ చైర్మెన్ ముడుపు దామోదర్‌రెడ్డి, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, సీనియర్ నాయకులు సంతోష్‌రావు, ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన వెంట ఉన్నారు.
