AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇది ఎప్పటికీ నా హృదయానికి హత్తుకునేదే

సమంత మళ్ళీ వార్తల్లో నిలిచింది. విజయ్‌ దేవరకొండ తో చేస్తున్న ‘ఖుషీ’ తెలుగు సినిమా షూటింగ్‌ మొదలయింది, అలాగే ఆమె చేస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ షూటింగ్‌ కూడా కొంతవరకు చేసింది. ఇందులో వరుణ్‌ ధావన్‌ నటిస్తున్నాడు, ఇది అమెరికాలో ప్రియాంక చోప్రా తో ఇంగ్లీష్‌ లో చేస్తున్న ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ కి భారతీయ భాషల్లో తీస్తున్నారు.

ఇవన్నీ ఇలా ఉంటే సమంత ఇంకొక సినిమా ‘శాకుంతలం’ విడుదలకి సిద్ధంగా వుంది. గుణశేఖర్‌ ఈ సినిమాకి దర్శకుడు అయితే, దిల్‌ రాజు, నీలిమ గుణ నిర్మాతలు. ఈ సినిమా సమంత చూసింది, చూసాక ఆమె అభిప్రాయాన్ని చాల భావోద్వేగమయిన మాటలతో సాంఫీుక మాధ్యమంలో పెట్టింది. ‘‘సినిమా అంతా ఇప్పుడే చూసా. చాలా బాగుంది, దర్శకుడు గుణశేఖర్‌ గారు ఎంతో బ్యూటిఫుల్‌ గా ఈ సినిమాని తీర్చిదిద్దారు. ఈ ‘శాకుంతలం’ ఎప్పటికీ నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాలో వున్నా గొప్ప భావోద్వేగాలను ఎప్పుడు చూస్తారా అని నేను ఎదురుచూస్తున్నాను,’’ అని చెప్పింది సమంత.

ANN TOP 10