AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బస్సు ఢీకొని కండక్టర్ భర్త మృతి…

ఆర్‌టిసి బస్సు ఢీకొట్టడంతో కండక్టర్ భర్త మృతి చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా కావలి ఆర్‌టిసి డిపోలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. సుభాషినే అనే మహిళ ఆర్‌టిసిలో కండక్టర్‌గా జాబ్ చేస్తుండడంతో మంగళవారం తెల్లవారుజామున ఆమెను కావలి డిపో వద్ద దించడానికి భర్త సుబ్బారాయుడు ద్విచక్రవాహనంపై వచ్చాడు. ఆమెను డిపోలో వదిలిపెట్టి వెళ్తుండగా అప్పుడే బస్సు క్యారేజీలో నుంచి బయటకు వస్తుంది. బస్సు అతడిపై దూసుకెళ్లడంతో సుబ్బరాయుడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. కళ్లముందే భర్త చనిపోవడంతో ఆమె శోకసంద్రంలో మునిగిపోయారు. వెంటనే బస్సు డ్రైవర్ ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సు కావలి క్యారేజీ నుంచి ఒంగోలుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

ANN TOP 10