సీఎం రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో రేవంత్‌కు డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
కరోనా వ్యాప్తి నేపథ్యంలో డాక్టర్లు ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి స్వల్ప జ్వరమే ఉందని.. తీవ్రమైతే హాస్పిటల్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక వేళ సీఎంకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారణ అయితే ఇటీవల ఆయనతో సమీక్షలో పాల్గొన్న మంత్రులు, అధికారులు కూడా టెస్టులు చేయించుకోనున్నారు.









