AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

నారాయణపేట : నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని మక్తల్‌ నియోజకవర్గంలోని జక్లేరు 167 జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండుకార్లు బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒక వాహనంలో ఉన్న వారిలో ఇద్దరు, మరో వాహనంలో ఉన్న ముగ్గురు చనిపోయారు.

తీర్థయాత్రలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా అంచనాకువచ్చారు. మరో నలుగురు క్షతగాత్రులను మక్తల్‌ ఆసుపత్రికి తరలించారు. మృతుల వద్ద ఉన్న ఆధార్‌ కార్డు, ఫోన్ల ఆధారంగా మహారాష్ట్ర, కర్ణాటక వాసులుగా గుర్తించామని పోలీసులు తెలిపారు.

ANN TOP 10