AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అహ్మదాబాద్‌ టెస్ట్‌ మ్యాచ్‌ డ్రా

అహ్మదాబాద్‌: బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా అహ్మదాబాద్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగిన చివరిదైన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితంగా టెస్టు సిరీస్‌ 2-1తో భారత్‌ సొంతమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 3/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ టీబ్రేక్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. చివరి సెషన్‌ ప్రారంభమయ్యాక మరో 17 పరుగులు జోడిరచిన తర్వాత మ్యాచ్‌ డ్రా అయినట్టు ప్రకటించారు. ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మాట్లాడుకుని మ్యాచ్‌ను ముగించాలని నిర్ణయిం తీసుకున్నారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ డ్రా అయినట్టు ప్రకటించారు. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ 2-1తో భారత్‌ సొంతమైంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 480 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖావాజా (180), కామెరాన్‌ గ్రీన్‌ (114) సెంచరీలతో రాణించారు. ప్రతిగా టీమిండియా 571 పరుగులు చేసింది. ఓపెనర్‌ శుభమన్‌ గిల్‌ (128), విరాట్‌ కోహ్లీ (186) సెంచరీలు చేశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన కంగారూ జట్టు చివరి సెషన్‌ వరకు ఆడిరది. అయితే ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో మ్యాచ్‌ డ్రా అయినట్టు ప్రకటించారు.

ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌పై భారత జట్టు కన్నేసినప్పటికీ చివరి టెస్టు డ్రా ముగియడంతో టీమిండియా ఆశలు అడియాసలైనట్టేనని భావించారు. అయితే, న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ నెత్తిన పాలుపోసింది. శ్రీలంకతో క్రైస్ట్‌చర్చ్‌లో జరిగిన జరిగిన తొలి టెస్టులో రెండు వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించడంతో శ్రీలంక డబ్ల్యూటీసీ ఫైనల్‌ అవకాశాలు కనుమరుగయ్యాయి. ఫలితంగా రోహిత్‌ శర్మ సేన నేరుగా ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 2019 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌, 2021 ప్రపంచ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత అభిమానుల హృదయాలను గాయపరిచిన న్యూజిలాండ్‌ ఈసారి మాత్రం వారి హృదయాలను గెలుచుకుంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10