మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి చింతల్‌లో చనిపోయిన మహిళ మృతదేహం మూడు రోజులుగా ఇంట్లోనే ఉంది. కుటుంబసభ్యులు పార్ధివ దేహానికి అంత్యక్రియలు చేయలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ ఇంట్లో మహిళ (40) చనిపోయి మూడు రోజులు అయింది. కుళ్లిపోయి పురుగులు పట్టినా.. అదే ఇంట్లో కుటుంబీకులు సాధారణ జీవనం గడుపుతున్నారు. ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
