AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చైనాలో భారీ భూకంపం.. 116 మంది మృతి

బీజింగ్‌: భారీ భూకంపంతో చైనా (China) వణికిపోయింది. భూకంప తీవ్రతతో వాయవ్య చైనాలో పెద్ద సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో 116 మంది మరణించారు. 400 మందికిపైగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత వాయవ్య చైనాలోని గన్సు (Gansu), కింగ్‌హై (Qinghai) ప్రావిన్సులలో భూకంపం (Earthquake) వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై దీనితీవ్రత 6.2గా నమోదయింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభవించాయని, గన్సు ప్రావిన్సులోని లాన్‌జ్హౌకు (Lanzhou) 102 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చైనీస్‌ మీడియా తెలిపింది.


అర్ధరాత్రివేళ భూకంపం రావడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప తీవ్రతకు పలు భవనాలు నేలమట్టమయ్యాయి. దీంతో భారీ నష్టం సంభవించింది. మంగళవారం తెల్లవారుజున అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నది. నేలకూలిన భవనాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్థానిక సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ANN TOP 10