AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘మన బంధం ఇలాగే కొనసాగాలి’.. పెళ్లి రోజున భార్యకు స్వీట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్‌, ఆయన సతీమణి శైలిమ సోమవారం (డిసెంబర్‌ 18) పెళ్లి రోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ తన భార్యకు సోషల్‌ మీడియా వేదికగా ఒక సర్‌ ప్రైజ్‌ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నాటి తన పెళ్లి ఫొటో, అలాగే తన భార్య పిల్లల ఫొటోలను ట్విట్టర్‌ లో షేర్‌ చేసిన కేటీఆర్‌ ‘ మై బ్యూటీఫుల్ వైఫ్ శైలిమకు 20వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. గత 20 ఏళ్లుగా నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నందుకు, ఇద్దరు అందమైన పిల్లలను ఇచ్చినందుకు, నా జీవిత ప్రయాణంలో గొప్ప భాగస్వామిగా నిలిచినందుకు కృతజ్ఞతలు. మన జీవిత ప్రయాణం ఇలాగే మరెన్నో సంవత్సరాల పాటు కొనసాగాలని ఆశిస్తున్నాను’ అంటూ తన సతీమణికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నెటిజన్లు కేటీఆర్‌- శైలిమ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరోవైపు కేటీఆర్‌, శైలిమల కుమారుడు హిమాన్షురావు కూడా తల్లిదండ్రులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపాడు. ‘అమ్మానాన్నలకు 20వ పెళ్లిరోజు శుభాకాంక్షలు. మీరిద్దరూ నా అమ్మానాన్నలు అయినందుకు నేను చాలా అదృష్టవంతుడిని. నేను మిమ్మల్ని చాలాచాలా ప్రేమిస్తున్నాను’ అంటూ తన పేరెంట్స్‌తో కలిసున్న ఫొటోను షేర్‌ చేశాడు.

ANN TOP 10