దాదాపు 105 రోజుల నుంచి బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫినాలే ఘట్టం ముగిసింది. టాప్ 6 కంటెస్టెంట్స్‌గా ఉన్న పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్‌లలో.. అర్జున్ టాప్ 6 స్థానం, ప్రియాంక టాప్ 5, ప్రిన్స్ యావర్ టాప్ 4 మరియు రూ. 15 లక్షలతో హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. విన్నర్, టాప్ 2, టాప్ 3 స్థానాల విషయంలో కాసేపు ఉత్కంఠని కలిగించినా.. ముందుగానే వచ్చిన లీక్‌ల మాదిరిగానే ఈ షోలో ఒక్కొక్కరూ ఎలిమినేట్ అయ్యారు. ఫైనల్‌గా ఎమ్ ఎమ్ కీరవాణి చెప్పిన ‘భూమి బిడ్డ’ (BB)నే బిస్‌బాస్ సీజన్ 7 ట్రోపీని కైవసం చేసుకున్నారు.
‘రైతు బిడ్డ’ పల్లవి ప్రశాంత్ కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టి.. ఫైనల్‌లో విజేతగా నిలిచి ట్రోఫీతో పాటు రూ. 35 లక్షల క్యాష్, మారుతి సుజుకీ కారు, రూ. 15 లక్షల వర్త్ జాస్ అలుక్కాస్ గోల్డ్‌ను గెలుచుకున్నారు. కింగ్ నాగార్జున పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినట్లుగా ప్రకటించడంతో.. పల్లవి ప్రశాంత్ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక టాప్ 2 మరియు రన్నర్‌గా అమర్ దీప్ నిలిచాడు. టాప్ 3 స్థానంతో శివాజీ సరిపెట్టుకున్నాడు. ఇలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 ముగిసింది.









