AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

కృష్ణాజిల్లా మచిలీపట్నం తాళ్లపాలెం బీచ్లో ఈరోజు విషాదఛాయలు అలుముకున్నాయి. ఆదివారం కావటంతో నూజివీడు త్రిపుల్ ఐటీలో చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ఉదయాన్నే సరదాగా మచిలీపట్నం బీచ్‎లో స్థానం చెయ్యటానికి వెళ్లారు. ఎంజాయ్ చేద్దాం అని వచ్చిన విద్యార్థులకు కాసేపు గడవకుండానే ఆ సరదా విషాదంగా మారింది. నీటిలో దిగిన కొద్దిసేపటికే సముద్రపు అలలు పెద్ద ఎత్తున ఎగసి పడుతు వుండటంతో మొత్తం ఐదుగురు విద్యార్థులు అలల్లో చిక్కుకుపోయారు. ఈత కొట్టే అవకాశం కూడా లేనంత అలల తాకిడికి గురయ్యారు.

ఈ క్రమంలో లోపలకు లాక్కుపోతున్న అలల నుండి బయటపడ్డారు ఇద్దరు పిల్లలు. మరో ఇద్దరు సముద్రంలోకి కొట్టుకుపోతుండగా వారిని మెరైన్ పోలీసులు గమనించారు. వెంటనే రంగంలోకి దిగి ఆ ఇద్దరు విద్యార్థులను రక్షించారు. దీంతో వారి ప్రాణాలు నిలబడ్డాయి. సముద్రానికి వెళ్ళిన మొత్తం ఐదుగురిలో నలుగురు అతి కష్టం మీద సురక్షితంగా బయటపడగా మారో వ్యక్తి సముద్రంలో కొట్టుకుని పోయాడు. ఒక్కసారిగా పెద్ద ఎత్తున ఎగసిపడిన అలల కింద చిక్కుకొని కొట్టుకుపోయిన అఖిల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు మెరైన్ పోలీసులు. ఎంత వెతికినా సముద్రంలో గల్లంతైన విద్యార్థి దొరకలేదు. దీంతో ఆ బాలుడి తల్లి తీవ్రమైన పుత్రశోకంలో ఉన్నారు. చేతికి అందివచ్చిన బిడ్డ మృత్యువు ఒడిలోకి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు మొత్తం శోకసంద్రంలో మునిగిపోయారు.

ANN TOP 10