AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రాఫిక్ ఆపొద్దు.. సీఎం కాన్వాయ్‌తో ప్రజలకు ఇబ్బంది రానివ్వొద్దు: రేవంత్‌రెడ్డి ఆదేశం

వినూత్న నిర్ణయాలతో పరిపాలన ప్రారంభించిన సీఎం రేవంత్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సిటీలో సీఎం కాన్వాయ్ మూమెంట్ వల్ల భారీగా ట్రాఫిక్ రద్దీ పెరిగిపోతోంది. గతంలో కేసీఆర్ ఈ స్థాయిలో పర్యటనలు చేయలేదు. దాదాపుగా పరిపాలన అంతా ప్రగతిభవ నుంచే కొనసాగించారు. సెక్రటేరియట్, సచివాలయం ఇవి కూడా ప్రగతి భవన్ కి దగ్గరగా ఉండడంతో అప్పటి సీఎం కాన్వాయ్ వల్ల పెద్దగా ఇబ్బందులు జరగలేదు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ దూకుడుగా పరిపాలన ప్రారంభించారు. ఉదయం ప్రజాభవన్ లో ప్రజా దర్బార్, ఆ వెంటనే సెక్రటేరియట్, అక్కడి నుంచి జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన నివాసానికి.. అప్పుడప్పుడు ఎం సి హెచ్ ఆర్ డి లో సమీక్ష సమావేశాలు ఇలా బిజీ బిజీగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో తన కాన్వాయ్ మూమెంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కాకూడదని సంచలన నిర్ణయం తీసుకున్నారు.

సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. సీఎం కాన్వాయ్ లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తానూ ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్ లు లేకుండా, ట్రాఫిక్ ను నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులకు సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి విస్తృత స్థాయిలో పర్యటనలను చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ నేపథ్యంలో తానూ ప్రయాణించే మార్గంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఏవిధమైన చర్యలు తీసుకోవాలో సూచించాలని పోలీస్ అధికారులను సి.ఎం కోరారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇంటిలో కూర్చోవడం తనకు సాధ్యం కాదన్నారు. కాన్వాయ్ లేకుండా వెళ్లడం ముఖ్యమంత్రులకు సాధ్యం కాదు. కచ్చితంగా భద్రతా సిబ్బందితోపాటు సీఎంవో అధికారులు కూడా ఆయన వెంట ఉండాల్సిందే. దీంతో భారీ వాహన శ్రేణి ఉంటుంది.

ANN TOP 10