AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలి

హెచ్ఎండీఏ ఉద్యోగుల సహకారంతో మరిన్ని కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలి కాటా అన్నారు. శుక్రవారం ఆమె హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… హెచ్ఎండీఏ అధికారుల సహకారంతో ముందుకు సాగుతానన్నారు. ప్రభుత్వం తనకు అభివృద్ధి చేసే అవకాశం కల్పించిందని వ్యాఖ్యానించారు. ఆమ్రపాలి బాధ్యతలు స్వీకరించిన సమయంలో హెచ్ఎండీఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, అర్బన్ పారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ ప్రభాకర్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్‌లతో పాటు హెచ్ఎండీఏ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.

ANN TOP 10