AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చిక్కిపోయిన శరీరం.. కదల్లేని స్థితిలో విజయకాంత్.. కన్నీరు పెట్టిస్తున్న వీడియో..

కంటతడి పెట్టుకుంటున్న అభిమానులు!
కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న విజయకాంత్
చనిపోయారనే ప్రచారం కూడా జరిగిన వైనం
మనుషులను కూడా గుర్తుపట్టని స్థితిలో కెప్టెన్

తమిళ సినీ పరిశ్రమను ఊపేసిన హీరోల్లో విజయకాంత్ ఒకరు. ‘కెప్టెన్ విజయకాంత్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి ప్రవేశించిన ఆయన తొలి చిత్రంతోనే స్టార్ హీరోగా మారిపోయారు. ఆ తర్వాత హీరోగా వెనుతిరిగి చూసుకోలేదు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో డీఎండీకే పార్టీని కూడా స్థాపించారు. తమిళనాట ఎంతో ఆదరాభిమానాలు కలిగిన విజయకాంత్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే చాలాసార్లు ఆసుపత్రిలో అడ్మిట్ అయి, డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పుడు కూడా దాదాపు 20 రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. విజయకాంత్ చనిపోయారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా ఆయనను పార్టీ కార్యక్రమానికి తీసుకొచ్చారు. బక్కచిక్కిపోయిన శరీరంతో, కూర్చీలో కదల్లేని స్థితిలో ఉన్న ఆయనను చూసి పార్టీ కార్యకర్తలు, అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. పక్కనున్న మనిషి ఆయనను పట్టుకుని ఉండాల్సిన స్థితిలో ఉన్నారు. మనుషులను కూడా గుర్తు పట్టడం లేదు. మరోవైపు డీఎండీకే పార్టీ జనరల్ సెక్రటరీగా ఆయన భార్య ప్రేమలతను పార్టీ కార్యవర్గం ఎన్నుకుంది.

ANN TOP 10