ఏపీ పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈరోజు అత్యంత విషాదకర ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. ఏలూరు నుంచి భీమవరం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉండి మండలం చెరుకువాడ సమీపంలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఆయన మృతి చెందారు. అంగన్ వాడీ వర్కర్ల సమ్మెలో పాల్గొని వెళ్తుండగా ఈ యాక్సిడెంట్ సంభవించింది. షేక్ సాబ్జీ మృతి పట్ల పార్టీలకు అతీతంగా నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలో పీడీఎఫ్ ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ షేక్ సాబ్జి కన్నుమూశారు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్, గన్‌మెన్, పీఏకి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ సాబ్జీ అంగన్‌వాడీ కార్యకర్తల సమ్మెలో భాగంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఎమ్మెల్సీ సీటు బెల్ట్ పెట్టుకోలేదని చెబుతున్నారు. అందుకే ఆయన చాతికి, తలకు తీవ్ర గాయాలు కావంతో చనిపోయినట్లు తెలుస్తోంది.









