కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అర్థరాత్రి మంటలు చెలరేగాయి. స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిడ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్రాలు చేశారు. అయితే లోపలకు వెళ్లే అవకాశం లేకపోవడంతో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. మంటలు ఎగిసిపడుతుండడంతో అయ్యప్ప షాపింగ్ మాల్ ప్రక్కన ఉన్న ప్రైవేట్ అసుపత్రిని అదికారులు ఖాళీ చేయించారు. పోలీస్, అగ్నిమాపక, రెవిన్యూ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయి.









