పార్టీ మార్పుపై ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిరోజులుగా ఎమ్మెల్యే దేవిరెడ్డి పార్టీ మారుతారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై ఆయన ఏమన్నారంటే.. ‘‘నేను పార్టీ మారుతున్నానని వస్తున్న వార్తలను ఖండిస్తున్నాను. నేను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లే ప్రసక్తేలేదు. పార్టీలో నాకు సముచిత స్థానం ఉంది. ఈ వార్తలను సృష్టిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటా. బీఆర్ఎస్ నేతలు తొందరపడి కాంగ్రెస్ పార్టీపై మాట్లాడొద్దు. ఓటమిని హుందాగా స్వీకరిద్దాం. కాంగ్రెస్ పార్టీ హామీల అమలుపై ఒత్తిడి తీసుకొద్ధాం. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. ఆ తర్వాతే బలమైన ప్రతిపక్షంగా మన గొంతు వినిపిద్దాం’’ అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి స్పష్టం చేశారు.









