AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు మరో షాక్.. ఏపీ స్టేట్ ఫైనాన్స్ నోటీసులు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. తమ వద్ద తీసుకున్న 20 కోట్ల రుణంతో పాటు వడ్డీ 25 కోట్లు కలిపి మొత్తం 45 కోట్లు చెల్లించాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మూరులోని జీవన్ రెడ్డికి ఇంటికి అధికారులు నోటీసులు అంటించారు. విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రై.లి. సంస్థ పేరుతో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ నుంచి ఈ రుణం తీసుకున్నారు. విష్ణుజిత్‌ సంస్థ ఆర్మూర్‌లోని ఆర్టీసీ స్థలాన్ని లీజుకు తీసుకొని జీవన్‌రెడ్డి మాల్‌ పేరిట కాంప్లెక్స్‌ నిర్మించింది.

ఆర్టీసీకి లీజు కింద ఇవ్వాల్సిన రూ.7.23 కోట్లు, విద్యుత్తుశాఖకు రూ.2.5 కోట్లు బకాయి పడటంతో ఆయా సంస్థలు ఈ నెల 7న నోటీసులు జారీ చేశాయి. విద్యుత్‌శాఖ కరెంటు సరఫరా కూడా నిలిపివేసింది. తాజాగా సోమవారం ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణ బకాయిలపై నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన తేదీ నుంచి 60 రోజుల్లోగా బకాయిలు చెల్లించకుంటే.. రికవరీ చట్టాలకు లోబడి నడుచుకుంటామని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ హెచ్చరించింది. బకాయిపడ్డ సంస్థ ఆస్తులను ఇతరుల పేరిట ట్రాన్స్‌ఫర్ చేయటం, లీజు ఇవ్వటం, విక్రయ హక్కులకు వీలు లేకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ANN TOP 10