ఐపీఎస్ అధికారి అంజనీకుమార్‌పై (IPS Officer Anjani Kumar) సీఈసీ (CEC) సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. అంజనీకుమార్ విజ్ఞప్తిని సీఈసీ పరిగణనలోకి తీసుకుంది. ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించలేదని ఆయన తెలిపారు. ఎన్నికల ఫలితాల రోజు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పిలిస్తేనే వెళ్లానని.. ఇలాంటి ఘటన పునరావృతం కాదని సీఈసీకి అంజనీకుమార్ హామీ ఇచ్చారు. దీంతో సస్పెన్షన్ ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సీఈసీ సమాచారం అందజేసింది.
కాగా.. తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెల్లడైన సమయంలో అంజనీకుమార్ రాష్ట్ర డీజీపీగా ఉన్నారు. ఈ క్రమంలో ఫలితాలు వెల్లడవుతుండగానే రేవంత్‌రెడ్డిని అంజనీకుమార్ కలిశారు. ఈ విషయాన్ని సీఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ అంజనీకుమార్‌ను ఈసీ సస్పెండ్ చేసింది. చివరకు దీనిపై వివరణ ఇచ్చుకోగా.. దాన్ని పరిగణలోకి తీసుకున్న సీఈసీ.. అంజనీకుమార్ సస్పెన్షన్ ఎత్తివేస్తూ సీఈసీ నిర్ణయం తీసుకుంది.