AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రైతులకు రేవంత్ శుభవార్త.. అకౌంట్లలోకి పెట్టుబడి డబ్బులు..!

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త వినిపించారు. ఇప్పటికే.. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీల్లో.. మహాలక్ష్మి, చేయూత పథకాలను ప్రారంభించిన రేవంత్ సర్కారు.. ఇప్పుడు రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పెట్టుబడి సాయం నిధుల విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు పంట పెట్టుబడి సాయం కింద చెల్లింపులు ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

అయితే.. ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు రూపొందించకపోవడంతో రైతులకు పంట పెట్టుబడి చెల్లింపు ఆలస్యం అవుతోంది. మరోవైపు.. రాష్ట్రంలోని పలు చోట్ల రైతులు యాసంగి పంట కోసం పొలం పనులు ప్రారంభించటంతో.. ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పెట్టుబడి సాయం వేస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ట్రెజరీలో ఉన్న నిధులను రైతులకు విడుదల చేయాలని నిర్ణయించారు.

అయితే.. రైతు భరోసా పథకంలో చెప్పినట్టుగా కాకుండా.. బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించిన రైతు బంధు మాదిరిగానే పెట్టుబడి సాయం అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం ఆదేశాలతో.. త్వరలోనే రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులు పడనున్నాయి.

ANN TOP 10