ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లాలని కోరిన కార్మికులు
తమ సమస్యల పరిష్కానికి కృషి చేయాలని విన్నపం
సానుకూలంగా స్పందించిన కంది
ఆదిలాబాద్: రిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆయన క్యాంప్ కార్యాలయం ప్రజా సేవ భవన్ లో రిమ్స్ ఆసుపత్రి ఔట్ సోర్సింగ్ కార్మిక సంఘం అధ్యక్షులు అక్రమ్ ఖాన్ ,ప్రధాన కార్యదర్శి దేవిదాస్ ఆద్వర్యంలో కార్మికులు కంది శ్రీనివాస రెడ్డి ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. తమ కిచ్చే అరకొర వేతనాల్లో కాంట్రాక్టర్ కోత పెడుతున్నారని ఒక్కో కార్మికుని జీతం నుండి 3వేల వరకు అక్రమంగా కట్ చేస్తున్నారిని చెప్పారు. అలాగే పేషంట్ కేర్ టేకర్స్ గా తీసుకొని ఇతర విధులు అప్ప చెబుతూ పని భారం మోపుతున్నారని, కార్మికుల పట్ల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.
ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలు చేర్చి తమకు న్యాయం చేయాలని కోరగా కంది శ్రీనివాస రెడ్డి సానుకూలంగా స్పందించారు. అనంతరం శాలువా,పుష్ప గుచ్చంతో కంది శ్రీనివాస రెడ్డి ని సత్కరించారు.ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, భూపెల్లి శ్రీధర్, షెడ్మాకి ఆనంద్ రావు, ముడుపు దామోదర్ రెడ్డి, కౌన్సిలర్ రషీద్ ఉల్ హాక్,ఉయిక ఇందిర,మునిగెల నర్సింగ్,నాగర్కర్ శంకర్,కొండూరి రవి,మానే శంకర్,రాజా లింగన్న,సురేష్, కాలనీ వాసులు నితిన్,వసీమ్, సలీం సోహెల్,అసిఫ్,ఫిరోజ్, షాహిద్ గజానంద్, శారద,సమీ ఉల్లా ఖాన్,రంగినేని కిషన్ రావు,ఎలాల్ సంజీవ్ రెడ్డి, రిమ్స్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.









