AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాంగ్రెస్ పార్టీ బ‌లోపేతం పై కంది ఫోక‌స్

ఓడినా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటా -కంది శ్రీ‌నివాస రెడ్డి
కంది శ్రీ‌నివాస రెడ్డి స‌మ‌క్షంలో భారీ చేరిక‌లు

ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్రం లో ఈ పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉండబోతోందని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ బ‌లోపేతం పై ఆయ‌న ఫోక‌స్ పెట్టారు.పట్టణంలోని సంజయ్ నగర్ లో నల్వాల సుమ ఆధ్వర్యంలో జరిగిన చేరికల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాలనీ వాసులు బాణసంచా కాల్చి డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు.14వ వార్డు నుండి భారీ సంఖ్య లో కాలనీ వాసులు కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారందరికీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. తాను ఓడినా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటాన‌ని తనకు ఓటేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని,రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని తాను ముందే చెప్పానని కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల అభిమానం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు.


ఈ పదేళ్లు కాంగ్రెస్ పార్టీ నే అధికారం లో ఉండబోతోందని ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ కే ఓటేయాలని కంది శ్రీనివాసరెడ్డి ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందని నిన్నటి నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ బీమా హామీలు అమల్లోకి వచ్చాయని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆరు గ్యారెంటీ హామీలు ఖచ్చితంగా అందరికీ అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, భూపెల్లి శ్రీధర్, షెడ్మాకి ఆనంద్ రావు, ముడుపు దామోదర్ రెడ్డి, కౌన్సిలర్ రషీద్ ఉల్ హాక్,ఉయిక ఇందిర,మునిగెల నర్సింగ్,నాగర్కర్ శంకర్,కొండూరి రవి,మానే శంకర్,రాజా లింగన్న,సురేష్, కాలనీ వాసులు నితిన్,వసీమ్, సలీం సోహెల్,అసిఫ్,ఫిరోజ్, షాహిద్ గజానంద్, శారద,సమీ ఉల్లా ఖాన్,రంగినేని కిషన్ రావు,ఎలాల్ సంజీవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10