AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫ్రీ జర్నీ ఎఫెక్ట్…. భక్తులతో కిక్కిరిసిన యాదాద్రి

హైదరాబాద్: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామివారి ఆలయానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. కార్తీక మాసం చివరి రోజుకావడంతో భక్తులు భారీగా పోటెత్తారు. తెలంగాణ నలుమూలల నుంచి భక్తులు రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి మూడు గంటల సమయం పడుతోంది.

భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్న వ్రతాలు చేయడంతో భక్తపారవశ్యంలో మునిగిపోయారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో విశేష పూజలు అందుకుంటున్నారు. అర్చకులు స్వయంభువులగా కొలిచి కవచ మూర్తులకు అష్టోతర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. ఆలయ కల్యాణ మండపంలో 108 కలశాలకు పూజలు చేపట్టారు. మహిళలకు ఉచితం ప్రయాణం కావడంతో భారీ సంఖ్యలో మహిళలు యాదాద్రికి తరలివచ్చారు.

ANN TOP 10