AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యశోద ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డ యశోద ఆస్పత్రికి చేరుకుని, 9వ అంతస్తులో ఉన్నమాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అలాగే కేసీఆర్ ఆరోగ్యపరిస్థితిపై డాక్టర్లను కూడా అడిగారు. మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కేసీఆర్ దగ్గర కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఎర్రబెల్లి దయాకరరావు, కత్త ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో వెంట మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ఉన్నారు. 20 నిముషాలపటు ముఖ్యమంత్రి యశోద ఆస్పత్రిలోనే ఉన్నారు. మాజీ సీఎం హోదాలో కేసీఆర్‌కు మెరుగైన వైద్యం అందించాలని మరోసారి డాక్టర్లకు సూచించారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి యశోద ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఆస్పత్రిలో పరామర్శించానని, మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించానని, త్వరగా కోలువాలని ఆకాంక్షించానన్నారు. కేసీఆర్ వైద్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అధికారులు, చీఫ్ సెక్రటరీకి ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. కేసీఆర్ తొందరగా కోలుకుని తెలంగాణ ప్రజల తరఫున శాసనసభలో సమస్యలపై మాట్లాడాలని, ఆయన సూచనలు, సలహాలు కొత్త ప్రభుత్వానికి ఇవ్వాలని ఆకాంక్షిస్తున్నానన్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10