AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు

సంగారెడ్డిలో ప్రభుత్వ కార్యక్రమాలకు నా భార్య నిర్మలకు సమాచారం ఇవ్వాలి
అధికారులకు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సూచన

ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ఎవరు నిర్లక్ష్యం వహించవద్దని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అధికారులకు సూచించారు. సంగారెడ్డిలో శనివారం ఆయన మాట్లాడుతూ సంగారెడ్డి నియోజకవర్గంలో అధికారులు తన సూచనలను పాటించాలని, నియోజకవర్గంలోని ప్రతీ అధికారిక కార్యక్రమాలకు తన భార్య నిర్మలారెడ్డికి సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టారన్నారు. ఇందులో భాంగానే సోనియాగాంధీ జన్మదినం కానుకగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో పాటు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.10 లక్షలకు పెంచుతూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

ఇక నుంచి మహిళలు రాష్ట్రంలో ఎక్కడైనా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని అలాగే ఆరోగ్యశ్రీ కింద రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్యం చేయించుకోవచ్చన్నారు. ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలను ఇప్పటికే అమలు చేయగా.. మిగతా నాలుగు గ్యారంటీలను కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉండి ప్రతిపక్ష హోదాలో ఉన్నానని అన్నారు. ఆ సమయంలో సంగారెడ్డి నియోజకవర్గంలోని ఓడిపోయిన చింతా ప్రభాకర్‌నే ప్రభుత్వ కార్యక్రమాలకు పిలిచేవారన్నారు. కానీ తాను హుందాగా వ్యవహరించి ఏమీ అనలేదన్నారు. ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల తాను ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. తన తరఫున ఇకనుంచి ప్రతీ ప్రభుత్వ కార్యక్రమాలకు తన భార్య నిర్మలారెడ్డి హాజరవుతారని అన్నారు. అధికారులందరూ నిర్మలారెడ్డికి సమాచారం ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా తాను పనిచేశానన్నారు.

ANN TOP 10