సీఎం రేవంత్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొదటి పథకాన్ని అమలు చేస్తున్నారు. సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా ఆరు గ్యారెంటీలో భాగమైన మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని డిసెంబర్ 9 మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభించనున్నారు. డిసెంబర్ 9 ఉదయం గంటలకు మొదటి శాసనసభ సమావేశాలు నిర్వహించి అనంతరం ఈ పథకాన్ని అమలు పరుస్తారు.
ఇందుకు సంబంధించి అన్ని ఆర్టీసీ డిపో అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలను ఇవ్వడం జరిగింది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, ఎక్స్ప్రెస్ బస్సుల్లో తెలంగాణ రాష్ట్ర మహిళలు అందరికీ ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రయాణం రాష్ట్ర సరిహద్దుల వరకు అందుబాటులో ఉంటుందని వివరించారు. రాష్ట్ర సరిహద్దు దాటిన బస్సుల్లో టికెట్ తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇందుకు సంబంధించి ఆర్టీసీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
నాగర్ కర్నూల్ డిపో ఆర్టీసీ మేనేజర్ దేవరాజు న్యూస్ 18 తో ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆర్టీసీ కండక్టర్లు అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని డిసెంబర్ 9 మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ పథకం అమలు కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళకు కూడా ఉచిత బస్ ప్రయాణం ఉంటుందని వీరితోపాటు ట్రాన్సజెండర్ లకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందని తెలిపారు.