AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీనియర్లకు కీలక శాఖలు..! ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశాలు

తెలంగాణ ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేసేశారు. పాలన కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో రెండు డిసెంబర్ 9 నుంచి అమల్లోకి వస్తాయి. ఇప్పుడు అందరి దృష్టి మంత్రులకు కేటాయించే శాఖలపైనే ఉంది. ఏ మంత్రికి ఏ శాఖ ఇస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం మంత్రి పదవులపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరుగుతున్నాయి.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. రేవంత్ రెడ్డితో పాటు కేసీ వేణుగోపాల్, మానిక్ రావు ఠాక్రే కూడా ఉన్నారు. వీరంతా మంత్రులకు శాఖల కేటాయింపుపై ఖర్గేతో చర్చలు జరిపారు. ఇక, ఖర్గేతో భేటీకి ముందు కేసీ వేణుగోపాల్ నివాసంలో గంటన్నర పాటు చర్చలు జరిగాయి. కేసీ వేణుగోపాల్ నివాసంలో చర్చల్లో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపు, ఖాళీగా ఉన్న మంత్రివర్గ స్థానాల భర్తీపై డిస్కషన్ చేశారు.

తన టీమ్ లో ఎవరెవరికి ఏఏ శాఖలు ఇవ్వాలనుకుంటున్నారు అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలకు నివేదిక తెచ్చినట్లు తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ తో చర్చించాకే మంత్రులకు శాఖల కేటాయింపు ఉంటుందని సమాచారం. శాఖల కేటాయింపులపై ఖర్గేకి రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఖర్గేతో జరిగే సమావేశంలో మంత్రులకు శాఖల కేటాయింపులపై స్పష్టత రానుంది. కాగా, సీనియర్లకు కీలక శాఖలు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ANN TOP 10