వీడియో వైరల్…
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాను వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగిపోవడంతో కోటిన్నర మందికిపైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారని అధికారులు వెల్లడించారు. రంగంలోకి దిగిన అధికారులు వరద ప్రభావ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. రానున్న 24 గంటల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని హెచ్చరించారు. పహారో నదిపై ఉన్న లవీ వంతెన తెగిపోవడంతో అధికారులు శాన్ఫ్రాన్సిస్కో బే ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కాలిఫోర్నియా అంతటా ఉరుములు, మెరుపులు బలమైన గాలులతో ఎడతెరిపి లేకుండా వర్షం దంచికొడుతోంది. దీంతో హైవేలు, వీధులన్నీ నీట మునిగిపోయాయి. సెంట్రల్ కాలిఫోర్నియాలోని టులే నది పొంగి ఇళ్లను ముంచెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
Media error: Format(s) not supported or source(s) not found
Download File: https://anntelugu.com/wp-content/uploads/2023/03/Zwznop5joDb_pXEy.mp4?_=1