ఢిల్లీ : ఎంపీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉత్తంకుమార్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే నివాసంలో తెలంగాణ సీఎం, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థుల ఖరారు తర్వాత దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాసేపట్లో లోకసభ స్పీకర్‌ని ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యే గా పదవీ ప్రమాణం చేసే ముందు లోకసభ సభ్యత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా సమర్పించనున్నారు.









